26-07-2025 04:34:06 PM
కామారెడ్డి (విజయక్రాంతి): రాష్ట్ర ఫుడ్ కమిషన్ మాజీ చైర్మన్ కొమ్ముల తిరుమలరెడ్డి తల్లి కొమ్ముల లింగమ్మ శనివారం మధ్యాహ్నం రెండు గంటలకు మృతి చెందినట్లు లక్ష్మీదేవి పల్లి గ్రామస్తులు తెలిపారు. కామారెడ్డి జిల్లా(Kamareddy District) భిక్కనూరు మండలం లక్ష్మీదేవి పల్లి గ్రామానికి చెందిన కొమ్ముల తిరుమలరెడ్డి టిఆర్ఎస్ సీనియర్ నాయకుడు, రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గా పనిచేశారు. ఆయన తల్లి మృతి చెందడం పట్ల లక్ష్మీదేవి పెళ్లి గ్రామస్తులతో పాటు బిక్కనూరు మండలం ప్రజలు చింతిస్తున్నారు.