calender_icon.png 27 July, 2025 | 2:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జీవో 49 రద్దు కోసం పోరాటం

26-07-2025 04:44:10 PM

సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు భూపాల్..

కాగజ్ నగర్ (విజయక్రాంతి): ఫారెస్ట్ కన్జర్వేషన్ ఏర్పాటుకు జారీ చేసిన జీవో 49 ను తాత్కాలిక నిలుపుదల కాకుండా శాశ్వతంగా రద్దు చేయాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు భూపాల్(CPM State Committee Members Bhopal) డిమాండ్ చేశారు. శనివారం కాగజ్ నగర్ పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 339 గ్రామాలు, మూడు లక్షల 65 వేల ఎకరాల పంట భూములు, నీటి వనరులు, నివాసాలు, హక్కులను కోల్పోతుండడంతో ప్రజలు చేసిన పోరాటానికి ప్రభుత్వం జీవోను తాత్కాలికంగా నిలుపుదల చేయడం సిపిఎం స్వాగతిస్తుందని అన్నారు. జీవో పూర్తిస్థాయి రద్దు కోసం ఈనెల 28 కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ధర్నా కార్యక్రమానికి జిల్లాలోని ఆదివాసీలు దళితులు కార్మికులు అన్ని వర్గాల ప్రజలు తరలిరావాలని పిలుపునిచ్చారు. జీవో పూర్తి స్థాయిలో రద్దు చేసేంతవరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి రాజన్న, నియోజకవర్గం కన్వీనర్ ఆనంద్ కుమార్, కమిటీ సభ్యులు శ్రీనివాస్ పాల్గొన్నారు.