calender_icon.png 27 July, 2025 | 2:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అల్ఫోర్స్ లో ఎన్సీసీ క్యాడెట్లకు "ఏ" సర్టిఫికెట్ పంపిణీ

26-07-2025 05:03:47 PM

కొత్తపల్లి (విజయక్రాంతి): కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఇ- టెక్నో పాఠశాల(Alphores E-Techno School)లో ఎన్సీసీ క్యాడెట్లకు ఏ-సర్టిఫికెట్స్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డి హాజరై మాట్లాడుతూ, విద్యార్థులు చదువుతో పాటు సామాజిక కార్యక్రమాలలో సైతం పాల్గొని అవగాహన పెంచుకోవాలని తెలిపారు. ముఖ్యంగా సమాజంలో పలు కార్యక్రమాలకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి దేశం పట్ల విధి నిర్వహణను చక్కగా నిర్వర్తించాలని, హక్కులను సకాలంలో వృధా కాకుండా చూసుకోవాలని సూచించారు. ఇటీవల పాఠశాలలో ఎన్సీసీ అధికారులుచే నిర్వహించిన ఏ సర్టిఫికెట్ పరీక్షలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన 46 మంది విద్యార్థులకు ఏ సర్టిఫికెట్లను ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.