calender_icon.png 27 July, 2025 | 2:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎమ్మెల్యే బాలు నాయక్ పై అసత్య ప్రచారాలు చేస్తే ఖబర్దార్..!

26-07-2025 04:47:33 PM

కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఊట్కూరి వేమన్ రెడ్డి..

దేవరకొండ: దేవరకొండ శాసన సభ్యులు నేనావత్ బాలు నాయక్(Devarakonda MLA Nenavath Balu Naik)పై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఖండిస్తున్నట్లు కొండమల్లేపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఊట్కూరి వేమన్ రెడ్డి తెలిపారు. శనివారం విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, గత బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఉన్న సామాగ్రి, ఫర్నిచర్, ఏసీలు కుర్చీలు, సోఫా సెట్ ఎత్తుకొని పోయారనీ వారు తెలిపారు. ఈ విషయం అనేక పత్రికలలో ప్రచురణ అయ్యిందని, క్యాంపు కార్యాలయంలో సామాగ్రి తీసుకోపోవడంతోనే రీన్నోవేషన్(మరమ్మతులు) చేయించారని వారు తెలిపారు. ఇది ఎమ్మెల్యే వ్యక్తిగత ఇల్లు కాదని, క్యాంపు కార్యాలయంలో వసతులు ఏర్పాటు చేయడం కూడా తప్పేనా అని వారు ప్రశ్నించారు. ఎమ్మెల్యే బాలు నాయక్ కు దేవరకొండలో సొంత ఇల్లు కలదు అని యూట్యూబ్ ఛానల్ లో వచ్చిన వార్త అవాస్తవమని ఏక్కడ ఇల్లు ఉందో చూపెట్టాలనీ వారు సవాల్ విసిరారు.

అలాగే పలు యూట్యూబ్ ఛానల్ ల్లో ఎమ్మెల్యే తన ఇంటికి రీన్నోవేషన్ చేపిస్తున్నారని చెబుతున్నారు ఎమ్మెల్యే బాలు నాయక్ క్యాంపు కార్యాలయానికి రీన్నోవేషన్ చేపించుకున్నారు.అలాగే గతంలో అక్కడ నిర్మాణాల్లో పలు లోపాలు ఉండడం వల్ల మరమ్మతులు చేయడం జరిగింది. దీనిపై బీఆర్ఎస్ సోషల్ మీడియా అసత్య ప్రచారాలు చేయడం తగదు అని వారు అన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వం కాలంలో  నిర్మించిన క్యాంపు కార్యాలయంలో వర్షం వస్తే ఉండలేని పరిస్థితిలో ఉందని వారు తెలిపారు. దొంగతనాలు చేసిన వాళ్లు కూడా మాట్లాడడం విడ్డూరమని వారు అన్నారు. ఎమ్మెల్యే బాలు నాయక్ పై సామాజిక మాధ్యమాలలో అసత్య ప్రచారం చేస్తే ఊరుకునేది లేదని వారు ఖబర్దార్ అని వారుహెచ్చరించారు. బాలు నాయక్ అభిమానులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సహనాన్ని పరీక్షించుకోవద్దని వారు హెచ్చరించారు.