26-07-2025 05:01:17 PM
బెల్లంపల్లి రూరల్ సిఐ హనోక్..
బెల్లంపల్లి అర్బన్ (విజయక్రాంతి): విద్యార్థులు కష్టపడి చదువుకొని ఉన్నత శిఖరాలకు ఎదగాలని బెల్లంపల్లి రూరల్ సీఐ హెచ్ హనోక్(Rural CI Hanok) అన్నారు. నెన్నెల్ మండలం కస్తూర్బా బాలికల ఉన్నత పాఠశాలలో శనివారం జరిగిన అవగాహన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. విద్యార్థినులు ఉన్నతమైన ఆశయాలను ఏర్పాటు చేసుకొని పట్టుదలతో కష్టపడి ఉన్నత స్థాయికి చేరుకొవాలన్నారు. తల్లితండ్రులకు మంచి పేరు తీసుకొని రావాలని ఉద్బోధించారు. ఎలాంటి చెడు ఆకర్షణలకులోను కాకుండా చదువుపైనే శ్రద్ధ పెట్టాలన్నారు. పోలీసులు ఎల్లవేళల అందుబాటులో ఉంటారనీ, ఎలాంటి సమస్య ఉన్న పోలీస్లకు చెప్పవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో నెన్నెల ఎస్ఐ కె ప్రసాద్, కస్తూర్బా స్కూల్ ప్రిన్సిపల్ పి కవిత, కానిస్టేబుల్ అనంతరావు, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.