26-07-2025 04:36:29 PM
జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్..
కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో శనివారం ఉదయం 11 గంటలకు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఐఆర్సిఎస్ సహకారంతో రక్తదాన శిబిరం ఘనంగా నిర్వహించారు. ఈ శిబిరాన్ని జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, గత సంవత్సరం కామారెడ్డి జిల్లా రక్తదాన రంగంలో రాష్ట్రస్థాయిలో మంచి గుర్తింపు పొందిందన్నారు. ఈ ఏడాది కూడా అవసరమైన వారికి అత్యవసర సమయంలో రక్తాన్ని అందించేందుకు శాఖల మధ్య సమన్వయంతో మరింత బలోపేతంగా ఈ కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. రక్తదాన శిబిరాన్ని పురస్కరించుకుని, గవర్నర్ అవార్డు పొందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ శాఖల అధికారులను సన్మానించి, మేమెంటోలు అందజేశారు.
కలెక్టర్ ఈ సందర్భంగా రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ ఎం. రాజన్నని ప్రత్యేకంగా అభినందించారు. ప్రతి నెల రెండు, మూడు రక్తదాన శిబిరాలు నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు, ప్రభుత్వ శాఖలు ముందుకొచ్చి సహకరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ రెవిన్యూ విక్టర్, జిల్లా అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ చందర్, ఎస్సీ కార్పొరేషన్ అధికారి దయానంద్, గ్రౌండ్ వాటర్ శాఖ సతీష్ యాదవ్,బీసీ వెల్ఫేర్ అధికారి షకీల్, చక్రధర్, డీఎస్సీ ఓ. వెంకటేష్,ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఐ ఆర్ సి ఎస్ జిల్లా చైర్మన్ ఎం. రాజన్న,కార్యదర్శి బి. రఘు కుమార్,కరస్పాండెంట్ డాక్టర్ పీ వి నరసింహం,డిసీఓ శ్రీలత తదితరులు పాల్గొన్నారు.