calender_icon.png 27 July, 2025 | 2:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వసతి గృహాల్లో ఉండే విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టాలి..

26-07-2025 04:41:23 PM

విద్యార్థులు మెస్ కమిటీతో పాటు రిజిస్టరు నిర్వహించాలి..

జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి..

వనపర్తి (విజయక్రాంతి): వసతి గృహాల్లో ఉండే విద్యార్థులకు, విద్యాలయాల్లో భోజనం చేసే విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం పెట్టాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి(District Collector Adarsh Surabhi) ఆదేశించారు. వంట గది, పరిసరాల్లో పరిశుభ్రత పాటించాలని సూచించారు. శనివారం ఉదయం వనపర్తి పట్టణంలోని భగీరథ కాలనీలో గల నర్సింగ్ కళాశాల, మర్రికుంట వద్ద గిరిజన సంక్షేమ శాఖ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ విద్యాలయాలను కలెక్టర్ సందర్శించారు. నర్సింగ్ కళాశాల వసతి గృహంలో వంట గది, స్టోర్ రూమ్ ను తనిఖీ చేశారు. విద్యార్థుల ద్వారా మెస్ కమిటీ ఖచ్చితంగా ఉండాలని, రిజిష్టర్ నిర్వహణ జరగాలని ప్రిన్సిపాల్ ను ఆదేశించారు. విద్యార్థులతో మాట్లాడి భోజనం ఎలా ఉంది, ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. వచ్చే వంట సరుకుపై చివరి గడువు తేదీ పరిశీలించాలని, గడువు తీరిన సరుకు, నాణ్యత లేని సరుకు వస్తె తిరిగి పంపించాలని, ప్రిన్సిపాల్ కు ఫిర్యాదు చేయాలని విద్యార్థులను సూచించారు.

అనంతరం మర్రికుంట వద్ద ఉన్న గిరిజన సంక్షేమ శాఖ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ పాఠశాలను సందర్శించారు. గత సంవత్సరం 10వ తరగతి, ఇంటర్మీడియట్ లో ఎంతమంది ఉత్తీర్ణత సాధించారు. ఐఐటి, ఎన్ఐటి లలో ఎంతమంది సీట్లు సాధించారు అని వివరాలు అడిగి తెలుసుకున్నారు. గత సంవత్సరం 11 మంది విద్యార్థులు ఐఐటీలో సీటు సంపాదించాలని ప్రిన్సిపల్ వివరించారు. స్పందించిన కలెక్టర్ వచ్చే సంవత్సరం ఈ కళాశాల నుండి అత్యధిక సంఖ్యలో ఐఐటి, ఎన్ఐటి లలో సీట్లు సంపాదించే విధంగా బోధన జరగాలని సూచించారు. సీట్లు పొందిన వారిని, అధ్యాపకులను కలెక్టరేట్ లో సన్మానం చేయడం జరుగుతుందని తెలిపారు. 9, 11వ తరగతి విద్యార్థులకు కంప్యూటర్ కోడింగ్ తరగతులు నిర్వహించాలని, అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తానని తెలియజేశారు. 

ఇంటర్మీడియట్ విద్యార్థులకు పైథాగ్రస్ సబ్జెక్ట్ బోధించిన కలెక్టర్

సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇంటర్మీడియట్ విద్యార్థులకు కలెక్టర్ సామర్థ్య పరీక్ష నిర్వహించారు. పైథాగ్రస్ సబ్జెక్ట్ లో ప్రశ్నలు వేసి బోర్డు పై సమాధానాలు రాబట్టారు. కలెక్టర్ వేసిన ప్రశ్నలకు విద్యార్థులు చక్కగా సమాధానాలు ఇవ్వడంపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఐఐటి ప్రవేశ పరీక్షల్లో సమస్యలు సులువుగా, త్వరగా సమాధానం ఎలా చేయాలో మెళుకువలు నేర్పించారు. ఈసారి అత్యధిక విద్యార్థులు ఐఐటి ఎన్ఐటి లలో సీట్లు సంపాదించాలని సూచించారు. కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు.