calender_icon.png 28 August, 2025 | 11:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తిరుమలగిరి ఎరువుల షాపులపై విజిలెన్స్ దాడులు

28-08-2025 08:51:50 PM

తుంగతుర్తి (విజయక్రాంతి): ఎరువుల షాపుల్లో సరి అయిన రికార్డులు లేనియెడల, అధిక ధరలకు అమ్మితే కేసులు నమోదు చేస్తామని ఉమ్మడి జిల్లా విజిలెన్స్ సిఐ మాచర్ల దశరథ అన్నారు. సూర్యాపేట జిల్లా(Suryapet District) తిరుమలగిరి మండల కేంద్రంలోని గురువారం వాసవి ట్రేడర్స్ ఫెర్టిలైజర్ షాప్ కు విజిలెన్స్ సిఐ వారి టీం మెంబెర్స్ వాసవి ఎరువులు షాపును తనిఖీ నిమిత్తము రావడం జరిగింది. వారితో పాటు మండల వ్యవసాయ అధికారి పాల్గొన్నారు.

తనిఖీ చేసినప్పుడు ఈపాస్ లో యురియా స్టాక్, ఫిసికల్గా ఉన్నటువంటి యూరియా స్టాక్ కు 13 బస్తాల వ్యత్యాసము గమనించటం జరిగింది. దీని గురించి వివరణ అడగగా రైతులు బిల్లు చేర్చుకున్నారు గాని ఇంకా తీసుకోలేదని షాప్ యజమాని చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి షాపులో రికార్డులన్నీ తనిఖీ చేయడం జరిగింది. తనిఖీ చేసిన తర్వాత వారికి పనిష్మెంట్గా స్టాప్ సేల్స్ నోటీసు జారీ చేయడం జరిగింది. తదుపరి చర్యలకు పై అధికారులకు నివేదిక సమర్పించడం జరిగింది. రైతులకు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తూ రైతులు ఫిర్యాదు చేస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.