20-09-2025 12:02:35 AM
- డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్
- సరూర్ నగర్ సర్కిల్ లో దుకాణాల్లో తనిఖీలు
ఎల్బీనగర్: ప్రజలు ప్లాస్టిక్ సామగ్రి వినియోగాన్ని పూర్తిగా తగ్గించాలని, దుకాణదారులు ప్లాస్టిక్ కవర్లు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ తెలిపారు. 120 మైక్రాన్ల లోపు ప్లాస్టిక్ కవర్లు, ఆహార పదార్థాలను ప్యాకింగ్ చేయడానికి సిల్వర్ కవర్లను వాడొద్దని సూచించారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ప్లాస్టిక్ కవర్లు విక్రయిస్తున్నట్లు సమాచారం రావడంతో సరూర్ నగర్ సర్కిల్ లో వివిధ దుకాణాలు, స్వీట్స్ షాపులు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లను డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్, హెల్త్ అండ్ శానిటేషన్ డిప్యూటీ ఇంజినీర్ (సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్) చందన చౌహాన్ సర్కిల్ తనిఖీలు నిర్వహించారు. 120 మైక్రాల లోపు వాడే ప్లాస్టిక్ కవర్లు వియోగంతో వచ్చే అనర్థాలు, ఆరోగ్య సమస్యలపై అవగాహన కల్పించారు. ప్లాస్టిక్ కు ప్రత్యామ్నాయంగా అరటి ఆకులు, పేపర్ కవర్లు వాడాలని సూచించారు. ప్లాస్టిక్ కవర్ల వాడకంపై అవగాహన కల్పించడానికి వివిధ కాలనీల్లో ప్రజలు, విద్యార్థులు, మహిళలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.