calender_icon.png 13 September, 2025 | 6:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థులకు క్రీడా దుస్తుల పంపిణీ

13-09-2025 03:19:27 AM

అర్మూర్, సెప్టెంబర్ 12 (విజయ క్రాంతి) : ఆర్మూర్ మండలంలోని ఇస్సాపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం జి జి ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్రీడా దుస్తులు పంపిణీ చేశారు.  కబడ్డీ క్రీడాకారులకు పోటీల్లో పాల్గొనేందుకు దుస్తులు లేకపోవడంతో అధ్యాపకుల కోరిక మేరకు దుస్తులు అందజేశారు.

జి జి ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు లయన్ నివేదన్ గుజరాతి  మాట్లాడుతూ క్రీడాకారులకు ప్రోత్సహించేటువంటి క్రమంలో భాగంగా వారికి దుస్తులు అందజేయడం జరిగిందన్నారు. రానున్న భవిష్యత్తు కాలంలో క్రీడాకారులకు మరిన్ని సదుపాయాలు ఫౌండేషన్ ద్వారా కల్పిస్తానని పేర్కొన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గంగారం, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, ఫౌండేషన్ ప్రతినిధులు బేల్దారి శ్రీనివాస్, దోండి నారాయణ వర్మ, డిజె సునీల్, కాశీనాథ్, ద్వారకనాథ్, అంబాదాస్ పాల్గొన్నారు.