13-09-2025 03:20:39 AM
జయశంకర్ భూపాలపల్లి(మహబూబాబాద్), సెప్టెంబర్ 12: ప్రజాపాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం విద్యకు ప్రథమ ప్రాధాన్యం ఇస్తుందని, విద్యతోనే అభివృద్ధి సాధ్యమని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నా రు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా పరిధిలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో యుద్ద ప్రాతిపదికన ఏఐ లాబ్స్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.
శుక్రవారం మహా ము త్తారం మండలంలో రూ.2కోట్ల30 లక్షలతో నిర్మించిన కేజీవీబీ జూనియర్ కళా శాల భవనం ప్రారంభోత్సవం, వివిధ గ్రామాల్లో 70 లక్షలతో నిర్మించనున్న అంతర్గత రహదారుల నిర్మాణానికి, 72 లక్షలతో నిర్మించనున్న అంగన్‌వాడీ భవనాలు, ఏడు గ్రామ పంచాయతీల్లో 1 కోటి 40 లక్షలతో నిర్మించనున్న గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే విద్యకు పెద్ద పీట వేస్తూ అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలు ఏర్పాటు ద్వారా అన్ని పాఠశాలల్లో మౌలిక సదుపాయ లు కల్పించామన్నారు.
నాణ్యమైన వి ద్యా బోధనకు డీఎస్సీ నిర్వహించి టీచర్ల నియామమకం చేపట్టామని, పదేళ్లుగా పెండింగ్ ఉన్న ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించామని తెలిపారు. విద్యా ర్థులకు కాస్మోటిక్, డైట్ చార్జీలు పెంచి నాణ్యమైన విద్య, భోజనం అందిస్తున్నామన్నారు. విద్యార్థులు బాగా చదివి తమ కాళ్లపై తాము నిలబడాలన్నదే ప్రభుత్వ సంకల్పమన్నారు. గ్రామంలో ఒక్కరు చదువుకున్నా వారు మాత్రమే కాకుండా మొత్తం గ్రామమే బాగుపడుతుందని మంత్రి తెలిపారు. 10వ తరగతి పరీక్షల లో వందకు వంద శాతం ఉత్తీర్ణత సాధించాలన్నారు. కేజీబీవీలో 10వ తరగతి విద్యార్థులకు టీ పైబర్ ద్వారా ఏఐ ల్యా బ్‌ను ఏర్పాటు చేస్తామన్నారు.
మారుమూల ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, గ్రామీణ ప్రాంత ప్రజల మౌలిక వసతుల కల్పనకు ప్రా ధాన్యమిస్తూ, అంగన్‌వాడీ కేంద్రాలు, గ్రామ పంచాయతీ భవనాలు నిర్మిస్తున్నట్లు చెప్పా. అభివృద్ధి పనుల్లో నాణ్యత పాటించాలని మంత్రి ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్‌శర్మ ట్రేడ్ ప్రమోషన్ చైర్మన్ అయిత ప్రకాష్‌రెడ్డి, ఈజీఎస్ రాష్ట్ర కౌన్సిల్ మెం బర్ దండు రమేష్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కోట రాజాబాపు, సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, మార్కెట్ కమిటీ చైర్మన్ పంతగాని తిర్మల సమయ్య, డీఈవో రాజేందర్, కేజీబీవీ ఎస్‌ఓ పుష్పవతి తదితరులు పాల్గొన్నారు.