calender_icon.png 22 July, 2025 | 4:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జిల్లాలో 14 వేల నూతన రేషన్ కార్డుల పంపిణీ

22-07-2025 12:40:22 AM

రాజన్న సిరిసిల్ల, జూలై 21(విజయక్రాంతి): అర్హులైన పేదలందరికీ నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిరంతర ప్రక్రియ అని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు.సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని చంద్రంపేట రైతు వేదికలోసిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని ఆయా వార్డులకు చెందిన ల బ్ధిదారులకు నూతన రేషన్ కార్డులను సోమవారం పంపిణీ చేశారు.జిల్లాలో నూతనంగా 14 వేల లబ్దిదారులకు రేషన్ అందించేందుకు కార్డులు పంపిణీ చేస్తున్నామని తెలి పారు.

ప్రతి లబ్ధిదారుడికి నెలకు 6 కిలోల సన్న బియ్యం రేషన్ ద్వారా పంపిణీ చేయ డం జరుగుతుందని వివరించారు. నూతన రేషన్ కార్డు ద్వారా ఇందిరమ్మ ఇండ్లు, ఫిం చన్ వంటి అనేక సంక్షేమ పథకాలకు అర్హత వస్తుందని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా స్ప ష్టం చేశారు.

రేషన్ కార్డులను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఇంకా కార్డు రాని వారు ఉంటే సమీపంలోని మీ సేవ కేం ద్రంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించా రు. కార్యక్రమంలో కే కే మహేందర్ రెడ్డి, జి ల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, సిరిసిల్ల మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ స్వరూపారెడ్డి, సిరిసిల్ల ఆర్డీవో వెంకటేశ్వర్లు, డీఎం సివిల్ సప్లై రజిత, లబ్ధిదారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.