19-09-2025 09:58:52 PM
టీయూడబ్ల్యూజే -ఐజేయు జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ రహమాన్
కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): మీడియా స్వేచ్ఛను హరించడం సిగ్గుచేటని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టు సంఘం (టీయూడబ్ల్యూజే -ఐజేయు) జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ రహమాన్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని జిజిహెచ్ ఆసుపత్రిలో మీడియాపై విధించిన ఆంక్షలు మీడియా స్వేచ్ఛకు భంగం కలిగించడమేనని ఈ విషయంపైన ఆయన మండిపడ్డారు. మీడియా స్వేచ్ఛను హరిస్తూ మీడియాపై ఆంక్షలు విధించిన ఆసుపత్రి సుపరిటెండెంట్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వ ఆసుపత్రిలో మీడియాపై విధించిన ఆంక్షలు ఎత్తివేసి, సూపరిటెండెంట్ పై చర్యలు తీసుకొని, జిల్లాలోని జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 22 తేదీన (సోమవారం) టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో ఉదయం 11:00 గంటలకు ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జర్నలిస్టుల ధర్నా కార్యక్రమానికి జిల్లాలోని జర్నలిస్టులు తరలివచ్చి జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. జర్నలిస్టులు చేపడుతున్న ధర్నా కార్యక్రమానికి రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, ప్రజాస్వామ్యవాదులు మద్దతు తెలిపాలని కోరారు.