29-09-2025 06:01:12 PM
నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కేంద్రంలో దుర్గా నవరాత్రి ఉత్సవంలో భాగంగా నిమజ్జన శోభాయాత్ర ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్(District Collector Abhilasha Abhinav) సోమవారం పరిశీలించారు. పట్టణంలోని బంగల్పెట్ చెరువు వద్ద నిమజ్జన శోభాయాత్రకు తగిన ఏర్పాట్లు చేయాలని వీధిలైట్లు పారిశుద్ధ్య పనులు చేపట్టాలని మున్సిపల్ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్ సానిటరీ ఇన్స్పెక్టర్ దేవిదాస్ అధికారులు పాల్గొన్నారు.