23-07-2025 12:00:00 AM
విద్యార్థులతో ముచ్చటించి మోటివేషన్ చేసిన కలెక్టర్
ఖమ్మం, జులై 22 (విజయ క్రాంతి): 9వ తరగతి విద్యార్థులకు జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి కొద్దిసేపు గణితం బోధించారు. జిల్లా కలెక్టర్, రఘునాథపాలెం మండలం వి. వెంకటాయ పాలెం గ్రామంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను మంగళవారం ఆకస్మికంగా తని ఖీ చేశారు.
ముందుగా పాఠశాల తరగతి గదిలో విద్యార్థులతో ముచ్చటించారు. స్కూల్ యూనిపామ్, పాఠ్య పుస్తకాలు, నోట్స్ బుక్స్ అన్ని వచ్చాయా, విద్యా బోధన ఎలా ఉంది, రోజు మం చిగా మధ్యాహ్న భోజనం ఇస్తున్నారా అని కలెక్టర్ ఆరా తీసారు. విద్యార్థులతో ఇంగ్లీషు అక్షరా లు, పదాలు చదివించారు. అపై తొమ్మిదవ తరగతి విద్యార్థులకు టీచర్ లాగా కలెక్టర్ బోర్డు పై లెక్కలు వ్రాసి గణితం పాఠాలు బోధించారు.
కొందరు విద్యార్థులు నోట్ పుస్తకాలు ఏవిధంగా రాస్తున్నారో పరిశీలించారు. వాళ్ళకి సబ్జెక్టులు ఏ విధంగా అర్థమవుతున్నాయి అనే విషయాన్ని విద్యార్థులతో మాట్లాడి తెలుసుకున్నారు. పాఠ్యాంశాలపై పలు ప్రశ్నలు అడిగి, విద్యార్థుల విషయావగాహన తెలుసుకున్నారు.కలెక్టర్ వెంట జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్. సత్యనారాయణ, ప్రధానోపాధ్యాయు శ్రీమన్నారాయణ, ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటి చైర్మన్ హనుమంతరావు అధికారులు, తదితరులు ఉన్నారు.