12-01-2026 12:46:43 AM
గుమ్మడిదల, జనవరి 11: ఎన్నికల సమయంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి నల్లవల్లి సర్పంచ్ తమవంతు కృషి చేస్తున్నారు. గుమ్మడిదల మండలం నల్లవల్లి గ్రామం ప్యారానగర్ గ్రామ ప్రజలు ఎన్నో సంవత్సరాల నుండి రేషన్ బియ్యం, పింఛన్ కోసమని సుమారు 6 కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లి తీసుకునే పరిస్థితి ఉండేది. కానీ స్థానిక ఎన్నికలలో ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి గ్రామ సర్పంచ్ కొరివి రాణిసురేష్ తమ వంతు కృషిని అందిస్తూ ఇచ్చిన మాట కోసం గ్రామ ప్రజలకు రేషన్ బియ్యం, పింఛన్ లు ప్యారా నగర్ గ్రామం వద్దకు వెళ్లి వారికి అందించడం జరిగింది.
ఈ సందర్భంగా సర్పంచ్ కొరివి రాణిసురేష్ మాట్లాడుతూ నమ్మిన ప్రజలకు ఇచ్చిన మాట కోసం కట్టుబడి ఉంటామని మరిన్ని సేవలను చేయడానికి మా వంతు కృషి ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో స్థానిక వార్డు సభ్యులు గంగాదేవి స్వరూపనరసింహులు మాజీ ఎంపీటీసీ కిష్టా గౌడ్ మాజీ ఉపసర్పంచ్ కొరివి శంకర్ మురళి గౌడ్ అజీమ్ శ్రీకాంత్ అరవింద్ నవీన్ సురేందర్ ప్రవీణ్ జి.వెంకటేష్ సిహెచ్ వెంకటేష్ సుదర్శన్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.