calender_icon.png 3 January, 2026 | 7:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జిల్లా కలెక్టర్‌కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన జిల్లా అధికారులు

03-01-2026 12:00:00 AM

కామారెడ్డి, జనవరి 2 (విజయక్రాంతి): నూతన సంవత్సరం 2026ను పురస్కరించుకొని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ కు జిల్లా అధికారులు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కలెక్టరేట్లోని తన ఛాంబర్లో  శుక్రవారం పలువురు జిల్లా అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది కలెక్టర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ మాట్లాడుతూ.. సమీష్టి కృషితో జిల్లాను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు.

ప్రజలకు ప్రభుత్వ పథకాలు సమర్థవంతంగా అందేలా అధికారులు అంకితభావంతో పనిచేయాలని సూచించారు. కొత్త సంవత్సరంలో జిల్లాలో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేసి, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో  జిల్లా అధికారులు జెడ్పీ సీఈఓ చందర్, సిపిఓ రఘునందన్, డి పి ఆర్ ఓ తిరుమల, సివిల్ సప్లై వెంకటేశ్వర్లు, డి ఎం శ్రీకాంత్, హార్టికల్చర్ జ్యోతి, dyso వెంకటేశ్వర గౌడ్, పిడి మెప్మ శ్రీధర్ రెడ్డి, deo రాజు, SC corporation వెంకటేశ్వర్లు, భూగర్భ జల శాఖ సతీష్, పిడి హౌసింగ్ విజయ పాల్ రెడ్డి, ఇండస్ట్రియల్ లాలూ, bc కార్పొరేషన్ , జయరాజ్, ఆడిట్ అధికారి  రామకృష్ణ, తదితరులు