calender_icon.png 3 January, 2026 | 6:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జీహెచ్‌ఎంసీ జోనల్ పరిధిలో ఇంజినీర్ల నియామకం

03-01-2026 12:00:00 AM

ఎల్బీనగర్, జనవరి 2 : గ్రేటర్ హైదరాబాద్ ను ఇటీవలే ప్రభుత్వం పునర్విభజన చేసింది. రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి జిల్లాలోని వివిధ ప్రాంతాలను కలుపుతూ ఔటర్ రింగ్ రోడ్ లోని, పక్కన ఉన్న 27 ప్రాంతాలను(యూఎల్ బీఎస్) గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోకి విలీనం చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం జీహెచ్‌ఎంసీని 12 జోన్లుగా, 60 సర్కిళ్లుగా  పునర్వ్యవస్థీకరించింది.

పరిపాలనా సౌలభ్యం కోసం ఇంజనీర్లను మల్కాజ్గిరి, ఉప్పల్, ఎల్బీనగర్ జోన్ లకు  నియమించారు. ఎల్బీనగర్ జోన్లో సూపరింటెండెంట్ ఇంజనీర్గా పనిచేస్తున్న వి.అశోక్ రెడ్డిని మల్కాజ్గిరి, ఉప్పల్, ఎల్బీనగర్ జోన్ లకు చీఫ్ ఇంజినీర్(నిర్వహణ, ఎస్ డబ్ల్యూఎం, రవాణా, వీధి దీపాలు)గా నియమించారు.

హయత్ నగర్లో ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్గా పనిచేస్తున్న కె.రమేష్ బాబుని మల్కాజ్గిరి, ఉప్పల్, ఎల్బీనగర్ జోన్ లకు ఈఈ (నిర్వహణ), సూపరింటెండెంట్ ఇంజనీర్ గా నియమించారు. కాప్రాలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పనిచేస్తున్న ఎల్. నాగేందర్ ని నాగోల్, హయత్ నగర్ సర్కిళ్లకు ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్గా నియమించారు. ఎల్బీనగర్లో ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్గా పనిచేస్తున్న వి.కార్తీక్ ని సరూర్ నగర్, ఎల్బీనగర్ సర్కిళ్లకు ఎగ్జిక్యూటివ్ ఇంజీనీర్గా నియమించారు.