24-07-2025 07:17:33 PM
బెజ్జంకి: మండల కేంద్రంలోని సాయిబాబా గుడిలో సీసీ కెమెరాలను గురువారం స్థానిక ఎస్ఐ సౌజన్య(SI Soujanya) ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ.. గ్రామాలలో, గుడిలలో, ఇతర రద్దీ ప్రదేశాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటుకు ప్రజలు వ్యాపారస్తులు సహకరించాలని కోరారు. సాయిబాబా గుడిలో రాచకొండ శివ శైలు, తిరుపతి గౌడ్ సహకారం సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందనీ, సీసీ కెమెరాలు ఏర్పాటు వల్ల దొంగతనాలు, నేరాలు నియంత్రించబడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ సుధాకర్ రెడ్డి బొల్లం పెద్దన్న, గుబిరే మల్లేశం, రావుల నర్సయ్య, బోనగం లక్ష్మీనారాయణ, పోచయ్య, బండి అని తదితరులు పాల్గొన్నారు.