calender_icon.png 23 May, 2025 | 5:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తత అవసరం

22-05-2025 11:46:33 PM

జిల్లా కలెక్టర్ల వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎస్ రామకృష్ణారావు..

హైదరాబాద్ (విజయక్రాంతి): రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు(CS Ramakrishna Rao) అన్ని జిల్లాల కలెక్టర్లకు సూచించారు. ప్రీమాన్సూన్ యాక్షన్ ప్లాన్‌లో భాగంగా ధాన్యం, పత్తి కొనుగోలు, పంట నష్టం జరగకుండా తీసుకోవాల్సిన చర్యలు, ఇతర వ్యవసాయ కార్యకలాపాలపై గురువారం జిల్లా కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. భారీ వర్షపాతం కారణంగా జిల్లాల్లో నెలకొన్న పరిస్థితులను కలెక్టర్లను అడిగి తెలుసుకున్నారు.   రాబోయే మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని, ఆ తర్వాత మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు.

ధాన్యం కొనుగోలు విషయంలో, కలెక్టర్లకు ఎస్.ఓ.పి ఖచ్చితంగా అనుసరించాలని తెలిపారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేసేలా చర్యలు తీసుకోవాలని సీఎస్ ఆదేశించారు. భారీ వర్షాల నేపథ్యంలో తీసుకోవలసిన జాగ్రత్తలు, ప్రభుత్వ యంత్రాంగం చేపట్టిన ముందు జాగ్రత్త చర్యల వివరాలను ప్రజలకు తెలియజేయాలని కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో తెరిచి ఉన్న నాలాలు, మ్యాన్‌హోల్స్‌పై అప్రమత్తత అవసరమన్నారు. వర్షాల కారణంగా ప్రాణ నష్టం జరగకుండా నివారించేందుకు ఫైర్ ఆఫీసర్లకు శిక్షణ ఇస్తున్నట్టు ఫైర్ సర్వీసెస్ డీజీ నాగిరెడ్డి  తెలిపారు. సమీక్షలో సివిల్ సప్లుసై ముఖ్య కార్యదర్శి డీఎస్ చౌహాన్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, వ్యవసాయ శాఖ డైరెక్టర్ గోపీ, వాటర్‌బోర్డు ఎండీ అశోక్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.