22-05-2025 11:42:59 PM
హైదరాబాద్ (విజయక్రాంతి): ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్ష(Inter Advanced Supplementary Examination)లకు 8,154 మంది గైర్హాజరయ్యారు. గురువారం నుంచి సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఉదయం జరిగిన ఫస్టియర్ పరీక్షకు 93,152 మంది విద్యార్థులకు గానూ 87,797 (94.25 శాతం) మంది హాజరవ్వగా.. 5,355 మంది గైర్హాజరయ్యారు. రంగారెడ్డి వరంగల్ మాల్ ప్రాక్టీస్ కేసు నమోదైంది. మధ్యాహ్నం జరిగిన సెకండియర్ పరీక్షకకు 28,855 మంది విద్యార్థుల్లో 26,056 (90.29 శాతం) మంది హాజరవ్వగా.. 2,799 మంది డుమ్మా కొట్టారు. రంగారెడ్డిలో మూడు, వరంగల్, నిజామాబాద్‌లో ఒక్కోటి చొప్పున మాల్‌ప్రాక్టీస్ కేసులు మినహా పరీక్షలు ప్రశాంతంగా జరిగినట్లు ఇంటర్ బోర్డు అధికారులు తెలిపారు.