16-08-2025 04:59:48 PM
చేపల వేటలో గ్రామస్తులు బిజీ... బిజీ..
బాన్సువాడ (విజయక్రాంతి): గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి కామారెడ్డి జిల్లా(Kamareddy District) బాన్సువాడ మండలం కోనాపూర్ గ్రామ పెద్ద చెరువు నిండి అలుగు పొంగిపొర్లుతుంది. అలుగు పొంగిపొర్లడంతో గ్రామస్తులు చూడడానికి తండోపతండాలుగా తరలివచ్చారు. అలుగు పొంగిపొర్లడంతో గ్రామస్తులు బిజీ బిజీగా చేపలు పడుతూ ఎంజాయ్ చేస్తున్నారు. భారీ వర్షానికి చెరువు నిండడంతో ఆలుగు పారడంతో గ్రామస్తులు రైతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.