calender_icon.png 16 August, 2025 | 6:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మామునూర్ విమానాశ్రయ భూ నిర్వాసితుల ధర్నా

16-08-2025 05:00:09 PM

వరంగల్,(విజయక్రాంతి): మామునూర్ విమానాశ్రయం కోసం గుంటూరు పల్లి, గాడిపల్లి గ్రామాల రైతుల నుంచి భూసేకరణకు ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. నిర్వాసితులుకు మార్కెట్ రేటుకు అనుగుణంగా ధర చెల్లించడంతోపాటు గ్రామాలకు సౌకర్యాలు కూడా ఇచ్చింది. ఇటీవల ఒక ఎకరానికి  1 కోటి 20 లక్షల రూపాయలు చెల్లించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని కలెక్టర్ నిర్వాసిత రైతులతో జరిగే సమావేశంలో మాట్లాడారు.

బహిరంగ మార్కెట్లో సుమారు రూ.5 కోట్ల విలువచేసే భూమికి 1 కోటి 20 లక్షల రూపాయలు చెల్లించడం సబబు కాదని రైతులు తెల్చి చెప్పారు. కనీసం వరంగల్ నెక్కొండ ప్రధాన రహదారి వెంట ఉన్న భూములకైనా రెండు కోట్ల రూపాయలు చెల్లించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అధికారులు స్పందించకపోవడంతో శనివారం వరంగల్ నెక్కొండ ప్రధాన రహదారి పై రైతులు భూ నిర్వాసితులు మార్కెట్ ధరకు అనుగుణంగా చెల్లించాలంటూ డిమాండ్ చేస్తూ ధర్నా చేపట్టారు. దీంతో వాహనాలు రాకపోకలు నిలిచిపోయాయి పోలీసులు అక్కడికి చేరుకొని ట్రాఫిక్ ను క్రమబద్దించారు.