calender_icon.png 20 October, 2025 | 7:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ధరలతో కళతప్పుతున దీపావళి

20-10-2025 12:47:18 AM

  1. బాణాసంచా ధరల మోత వెల వెల పోతున్న దీపావళి దుకాణాలు
  2. బాణసంచా ధరలు పెరగడంతో వినియో గదారుల విలవిల
  3. ఆందోళన వ్యక్తం చేస్తున్న విక్రయదారులు

మణుగూరు, అక్టోబర్ 19 (విజయక్రాంతి) : ధరల నేపథ్యంలో దీపావళి పండగ కళ తప్పింది. అన్ని పండగల్లాగే దీపావళి కూడా ఇంటికే పరిమితం కానుంది. బా ణాసంచా కాల్చితేనే దీపావళి కాదు. అయితే దీపావళి ప్రత్యేకతే వేరు. అయితే బాణాసంచా ధరలు కూడా విపరీతంగగా పెరి గాయి. దీపాలతో ఇల్లంతా వెలగించి కొత్త కాంతులను ఆహ్వానించడం ద్వారా పండగ జరుపుకోవాలని భావిస్తున్న పేద మధ్యతరగతి వర్గాలను  ధరలు బెంబేలేతిస్తున్నాయి. 

జిల్లాలో   దీపావళి బాణసంచా దుకాణాలు గిరాకీ లేక వెలవెలబోతు న్నాయి. బాణసంచా ధరలను అధికంగా పెరగడం  వల్ల వినియోగదారులు కొనుగోలు చేసుకునేందుకు ముందుకు రాకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. దీనిపై విజయక్రాంతి అందిస్తున్న కథనం..

వెలవెలపోతున్న  దుకాణాలు..

ఏటా పండుగకు వారం ముందునుంచే బాణాసంచా విక్రయాలతో సందడి ప్రారం భమవుతుంది. బాణాసంచా దుకాణాలకు అనుమతి పక్రియలో భాగంగా ఒక్కో దుకాణదారుడు రూ.30వేల వరకు ఖర్చు చేసినట్లు సమాచారం. ఇక ఒక్కో దుకాణ దారుడు సుమారు లక్ష నుంచి రూ.5లక్షల వరకు బాణసంచా కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అమ్మకాలు సాగు తాయా లేదా అన్న భయం విక్రయదారులలో నెలకొంది.

లక్షల ఖర్చుపెట్టి బాణ సంచా దుకాణాలు వెలవెలబోతున్నాయి. బాణసంచా ధరలను అధికంగా పెంచడం వల్ల వినియోగదారులు కొనుగోలు చేసుకునేందుకు ముందుకు రాకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. రెవెన్యూ సహా వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు బాణసంచా దుకాణదారుల నుంచి భారీగా లైసెన్సు ఫీజులు వసూలు చేయడంతో వ్యాపారులు విలవిల్లాడిపోతున్నారు.

ఒక షాపుకు వచ్చి అన్ని లైసెన్సు ఫీజులు కలిపి రూ.25వేలు నుంచి రూ.30వేల వరకు పైనే చెల్లించాల్సి వస్తోందని వారు లబో దిబోమంటున్నారు. మణుగూరు పట్టణంలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్  స్టేడియంలో బాణసంచా దుకాణాలను ఏర్పాటు చేశారు. పట్టణ, పరిసర ప్రాంతాల ప్రజల కోసం ఈ ఒక్కచోటే 20 కి పైగా దుకాణాలు ఏర్పా టు చేశారు. అధికారులు  దుకాణాలకు అనుమతి ఇచ్చారు.

లైసెన్సు ఫీజుతో పాటు జీఎస్టీ సహా వివిధ రకాల ట్యాక్సు లు బాణసంచా విక్రయాలపై భారీగా విధించడంతో వ్యాపారులు రేట్లు పెంచి విక్రయాలు జరుపుతున్నారు . కొన్ని రోజులకు ముందే దీపావళి వేడుకల హడావుడి కనిపించేది. అయితే ఈసారి ఆదివారం నుంచి మాత్రమే వ్యాపారాలకు అనుమతి ఇవ్వడంతో సరుకు సర్దుకునే పనిలో ఉన్నారు.

దీపావళి దుకాణాల వద్ద కాకరపువ్వొత్తులు, తాళ్లు, అగ్గిపెట్టెలు, చిచ్చుబుడ్లు, మతాబులు, సీమ టపా కాయలు, థౌజండ్ వాలాలు, షాట్స్ వంటి వివిధ రకాల వస్తువుల ధరలు గతం కంటే భారీగా పెరిగిపోయాయి. వేలకు వేలు ఖర్చు చేసి కొనుగోలు చేసినా కొద్దిపాటి సామగ్రి కూడా వచ్చే పరిస్థితి లేదంటూ కొనుగోలుదారులు ఆవేదన చెందుతున్నారు. పెరుగుతున్న ధరలతో దీపావళి కళ తప్పిందనే చెప్పాలి.