calender_icon.png 22 October, 2025 | 3:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేపటిలోగా ప్రతి ఉద్యోగి వివరాలు నమోదు చేసుకోవాలి

21-10-2025 06:28:03 PM

జిల్లా ఖజానా శాఖ సహాయ సంచాలకులు జి. భానుమతి..

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): రాష్ట్ర ఆర్థిక శాఖ ఆదేశాల మేరకు ఖజానా శాఖ నుండి వేతనాలు తీసుకుంటున్న జిల్లాలో పనిచేసే ప్రతి ఉద్యోగి పోర్టల్ లోని హెచ్.ఆర్. మాడ్యూల్ లో తమ వివరాలు ఈనెల 22లోగా నమోదు చేసుకోవాలని జిల్లా ఖజానా శాఖ సహాయ సంచాలకులు జి. భానుమతి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి ఉద్యోగి తమ ఆధార్ కార్డు, పాన్ కార్డు, చరవాణి నెంబర్ నవీకరించుకోవాలని, అన్ని వివరాలు నమోదు చేసుకున్న తర్వాత అక్టోబర్ నెలకు సంబంధించిన వేతన బిల్లులు ప్రాసెస్ చేసుకోవాలని, ఒకవేళ వివరాలు నమోదు చేసుకోనట్లయితే డి.డి.ఓ. లకు అక్టోబర్ నెలకు సంబంధించిన వేతనాల బిల్లులు ఐ.ఎఫ్.ఎం.ఐ.ఎస్. పోర్టల్ లో ఓపెన్ కాదని తెలిపారు.

జిల్లాలో పనిచేస్తున్న ఉద్యోగుల వివరాలను డి.డి.ఓ.లు కచ్చితంగా నమోదు చేయాలని, వివరాలు నవీకరించుకోని వారికి అక్టోబర్ నెలకు సంబంధించిన వేతనాలు మంజూరు కావని తెలిపారు. సి.పి.ఎస్. పరిధిలో వచ్చే ఉద్యోగులు సైతం తమ వివరాలు పర్మనెంట్ రిటైర్మెంట్ అకౌంట్ కు అనుసంధానం చేసుకోవాలని, బ్యాంకు ఖాతా నంబరు, ఐ.ఎఫ్.ఎస్.సి. కోడ్, జిమెయిల్ అడ్రస్, చరవాణి నెంబర్ అనుసంధానం చేసుకోవాలని తెలిపారు.