10-09-2025 12:00:00 AM
మంచిర్యాల, సెప్టెంబర్ 9 (విజయక్రాం తి): జిల్లాలో విధులు నిర్వహిస్తున్న హెల్త్ కేర్ సిబ్బందికి, వైద్యులకు, వైద్య సిబ్బందికి పారామెడికల్ సిబ్బందికి, ఆసుపత్రిలో పనిచేస్తున్న 1071 మందికి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మంగళవారం ఎంసిహెచ్‌లో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ అనిత ప్రారంభిం చారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశా ఖ అధికారిని మాట్లాడుతూ.. జిల్లాలో వైద్యులు, వైద్య సిబ్బందికి, సామాజిక ఆరోగ్య కేంద్రంలో సిబ్బందికి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టమన్నారు.
అదే విధంగా 2030 నాటికి మన జిల్లాలో కాలేయాన్ని కాపాడు దాం హేపటైటిస్ బి దూరం చేద్దాం.. అని నినాదంతో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించామని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని, ముఖ్యంగా కాలేయానికి సం బంధించిన వ్యాధులు రాకుండా జాగ్రత్తపడాలని కోరారు. అన్నం తిన్న తర్వాత తీసుకో వాలని, తీసుకున్న తర్వాత అరగంట సేపు వైద్యుల పర్యవేక్షణలో ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ హరిచంద్ర రెడ్డి, డాక్టర్ భీష్మ, డాక్టర్ శ్రీధర్, డాక్టర్ సుధాకర్ నాయ క్, ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ ఏ ప్రసాద్, డాక్టర్ అనిల్, డాక్టర్ కృపా బాయ్, ఫిజీషియన్లు, హెడ్ నర్సులు వైద్యులు, సిహెచ్‌ఓలు నామదేవ్, వెంకటేశ్వర్లు, డి పి హెచ్ ఎన్ లింగారెడ్డి, పద్మ, పాల్గొన్నారు.