calender_icon.png 10 September, 2025 | 8:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బడుగుల హక్కుల కోసం పోరాడిన వ్యక్తి సూర్యం

10-09-2025 12:00:00 AM

-మాజీ మావోయిస్టు జిల్లా కార్యదర్శి జీవిత చరిత్ర పుస్తకావిష్కరణ

నిర్మల్, సెప్టెంబర్ ౯ (విజయక్రాంతి): బడుగుల హక్కుల కోసం ప్రజలను చైతన్యం చేసి ప్రజా ఉద్యమాన్ని నడిపిన మాజీ మావోయిస్టు నేత జిల్లా కార్యదర్శి స్వర్గీయ (వరకంటి పండరి) సూర్యం అన్న ఉద్యమ నేపథ్యన్ని తెలిపే ఆరని వెలుగు సూర్యం అనే పుస్తకాన్ని మంగళవారం నిర్మల్ లో ఆవిష్కరించారు.

స్వర్గీయ సూర్యం అన్న విప్లవ ప్రస్తానని ప్రజలతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేస్తూ ఆయన సోదరుడు రిటైర్డ్ పిజి హెడ్మాస్టర్ వరకంటి మురళీధర్ ఈ పుస్తకా న్ని రచించారు. పట్టణంలోని పెన్షనర్ల భవ నం నిర్వహించిన పుస్తకావిష్కరణలు విప్లవ నేతలు పద్మ వేణుగోపాల్ పానితో పాటు మాజీ ఎంపీ సోయం బాపూరావు పిసిసి ఉపాధ్యక్షురాలు ఆత్రం సుగుణ, బార్ అసోసియేషన్ అధ్యక్షులు అల్లూరి మల్లారెడ్డి ఉద్యమకారులు, మాజీ లొంగిపోయిన మా వోయిస్టులు హాజరయ్యారు.

నిర్మల్ జిల్లాలో పుట్టిన సూర్య అలియాస్ పండరి ప్రభుత్వం పై తిరుగుబాటు చేసిన ఓ గొప్ప వ్యక్తి అని, ఆయన చరిత్ర నేటి తరానికి పుస్తక రూపం లో అందించిన కుటుంబ సభ్యులకు ఉద్య మ నేతలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సత్వాజి, అజయ్, నాగరాజు జ్యోతి అక్క ఉద్యమకారులు పాల్గొన్నారు.