calender_icon.png 10 September, 2025 | 5:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గణనాథుడు శోభాయాత్రలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి

09-09-2025 11:40:00 PM

వలిగొండ (విజయక్రాంతి): వలిగొండ మండల కేంద్రంలోని మారమ్మ యువసేన యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన గణనాథుడి శోభాయాత్రలో భువనగిరి మాజీ ఎమ్మెల్యే, బిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జీ పైళ్ల శేఖర్ రెడ్డి(Incharge Paila Sekhar Reddy) పాల్గొన్నారు. ఈ సందర్భంగా యూత్ సభ్యులు పైళ్ల శేఖర్ రెడ్డిని శాలువాతో సన్మానించారు. అదేవిధంగా శోభాయాత్రలో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు పాశం సత్తిరెడ్డి, బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు తుమ్మల వెంకటరెడ్డి, బిజెపి మండల పార్టీ అధ్యక్షుడు బొల్ల సుదర్శన్, ఏలే చంద్రశేఖర్, టేకులసోమరంకు చెందిన చేగూరి మల్లేశం పాల్గొనగా ఉత్సవ కమిటీ నిర్వాహకులు వారిని శాలువాలతో సన్మానించారు. శోభాయాత్ర సందర్భంగా యూత్ సభ్యులు ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాల అలంకరణ, ఎల్ఈడి స్క్రీన్లు, డోలు వాయిద్య కారులు అందరిని ఆకట్టుకున్నాయి.