06-08-2025 04:26:44 PM
చిట్యాల (విజయక్రాంతి): ప్రొఫెసర్ జయశంకర్ శంకర్ సార్ 91వ జయంతి వేడుకలను బుధవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా(Jayashankar Bhupalpally District) చిట్యాల మండల కేంద్రంతో పాటు, వివిధ గ్రామాల్లో ఘనంగా నిర్వహించారు. విశ్వబ్రాహ్మణ, విశ్వకర్మ ఐక్య సంఘం అధ్యక్ష, కార్యదర్శులు, ఏవైఎస్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ పుల్ల మల్లయ్య వీరి వీరిగా నిర్వహించిన కార్యక్రమాల్లో జయశంకర్ సార్ చిత్రపటానికి నివాళులర్పించి పూలమాలలు వేశారు. జయశంకర్ సార్ తెలంగాణ ఉద్యమానికి ప్రాణం పోసిన మహానుభావుడని, ఆయన ఆలోచనలు, పోరాటం మార్గదర్శకంగా నిలిచాయని కొనియాడారు. ప్రభుత్వం ఆయన జయంతిని అధికార పూర్వకంగా జరపాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో శృంగారపు రంగాచారి, మొగులోజు భగవత్ చారి , పోతగంటి చంద్రమౌళి, చిలువుల రాజమౌళి,కలచర్ల కృష్ణమూర్తి, చిలుముల రమణాచారి, తిరుపతి, ఏవైఎస్ మండల అధ్యక్షుడు జన్నె యుగేందర్, కట్కూరి రాజు,పాముకుంట్ల చందర్ తదితరులు పాల్గొన్నారు.