08-01-2026 12:33:28 AM
కాప్రా సర్కిల్ డిప్యూటీ కమిషనర్ శ్రీహరి
కుషాయిగూడ, జనవరి 7 (విజయక్రాంతి): స్వచ్ఛ సర్వేక్షన్ కార్యక్రమాల్లో భాగంగా బుధవారం కాప్రా సర్కిల్లో గల అన్ని జీవి పిలవద్ద చెత్త లేకుండా శుభ్రం చేయవలసిందిగా ఆదేశించినందున ఈ కింద తెలిపిన ప్రాంతాల్లో కాలనీ వారి భాగస్వామ్యంతో కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో కాప్రా సర్కిల్ కాప్రా డివిజన్ పద్మారావు నగర్ శ్రీగురు రాఘవేంద్ర నగర్ కాలనీ మధ్యలో అసోసియేషన్ వారి సహకారంతో సీసీ కెమెరా, మైక్ ఏర్పాటు చేసి జీవీపీ వద్ద చెత్త పడకుండా చర్యలు తీసుకుంటున్నట్టు డిప్యూటీ కమిషనర్ శ్రీహరి తెలియజేశారు చర్లపల్లి డివిజన్ ఈసీ నగర్ అసోసియేషన్ వారి భాగస్వా మ్యం తో వెంకట్ గారు రెండు సీసీ కెమెరాలు ఈసీ నగర్ ప్రధాన రహదారి కి ఇరువైపులా చెత్త పడకుండా ఏర్పాటు చేసినట్టు తెలియజేశారు
ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఇంజనీర్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రవి సానిటరీ సూపర్వైజర్ సుదర్శన్ జవాన్ రామకృష్ణ శ్రీనివాస్ ధర్మేందర్ ఎస్ ఎఫ్ ఏ లు వసంత, సంజీవ, అంజలి, కోటేశ్వరి వరలక్ష్మి, రామ్‌కి సూపర్వైజర్ రోనిత్ శానిటేషన్ సిబ్బంది మరియు రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో అక్కడ పోగానే చెప్తాను టిప్పర్ల ద్వారా ఎత్తించి సిబ్బందిచే శుభ్రం చేశారు