calender_icon.png 14 September, 2025 | 3:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మద్యం తాగి వాహనాలు నడిపవద్దు

23-03-2025 10:35:27 PM

నిజాంసాగర్ (విజయక్రాంతి): మద్యం తాగి వాహనాలు నడిపితే చర్యలు తప్పవని నిజాంసాగర్ ఎస్సై శివకుమార్ పేర్కొన్నారు. ఆదివారం కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండల కేంద్రంలో వాహనాలు తనిఖీ చేసి బ్రీత్ అనలైజర్ ద్వారా వాహన చోదకులకు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై శివకుమార్ మాట్లాడుతూ... మహిళలకు తమ తల్లిదండ్రులు వాహనాలు ఇవ్వవద్దని, వాహనాలలో తప్పనిసరిగా రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని ఆయన సూచించారు. లేకుంటే కేసులు తప్పవని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.