calender_icon.png 22 July, 2025 | 7:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లోన్‌యాప్, హనీట్రాప్‌లో పడొద్దు

11-08-2024 01:15:25 AM

ఏపీ హోం మంత్రి అనిత

హైదరాబాద్, ఆగస్టు 10 (విజయక్రాంతి): లోన్ యాప్, హనీ ట్రా ప్ లాంటి వలలో ప్రజలు పడొద్దని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత సూచించారు. దేశ వ్యాప్తంగా గత నాలుగు నెలల్లో రూ.1,730 కోట్ల విలువైన సైబర్ నేరాలు జరిగాయని పేర్కొన్నారు. శనివారం సైబర్ నేరాలపై అవగాహన కోసం ఏపీలోని విజయవాడ లో వాకథాన్ నిర్వహించారు. 16 రకాల సైబర్ మోసాలపై అవగాహన, ఫిర్యాదుల కోసం రూపొందిం చిన యాప్‌ను అనిత ప్రారంభించారు. ఈసందర్బంగా హోంమంత్రి అనిత మాట్లాడుతూ.. దేశంలో 24 శాతం వరకు సైబర్ నేరాలు పెరిగాయని, నిత్య జీవితంలో వినియోగిం చే అనేక యాప్‌ల ద్వారా మోసాలు జరుగుతున్నాయని చెప్పారు.

అనేక సామా జిక మాధ్యమాలు, యాప్‌లకు పౌరు లు అందిస్తున్న వ్యక్తిగత సమాచారమే ఈ తరహా మోసాలకు కారణమవుతుందని వెల్లడించారు. ఈ తరహా నేరాల నియంత్రణకు రాష్ట్ర స్థాయిలో సైబర్ సమన్వయ బృందం ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రతి జిల్లాలో సైబర్ సెల్ చురుగ్గా పనిచేసేలా చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు. అనంతరం సీపీ రాజశేఖర్ మాట్లాడుతూ.. సైబర్ నేరం జరిగిన వెంటనే 1930కు ఫోన్ చేయాలని సూచించారు.