20-11-2025 12:09:38 AM
పాట్నా, నవంబర్ 19: బీహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ బుధవారం తన పద వికి రాజీనామా చేశారు. ఈమేరకు పాట్నాలోని రాజ్‌భవన్‌లో గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్‌ను కలిసి రాజీనామా పత్రాన్ని సమర్పించారు. తమకు ఎన్డీయే కూటమి మద్దతు ఉందని, ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఆహ్వానించాలని కోరారు. తనకు భారతీయ జనతా పార్టీ (బీజేపీ), జనతాదళ్ (యునైటెడ్), లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్), హిందుస్థానీ అవామ్ మోర్చా (హెచ్‌ఏఎం), రాష్ట్రీయ లోక్ మోర్చా (ఆర్‌ఎల్‌ఎం) ఎమ్మెల్యేల మద్దతు ఉందని, వారి సంతకాలతో కూడిన పత్రాన్ని గవర్నర్‌కు సమర్పించారు.
గవర్నర్ తర్వాత నితీశ్‌కుమార్ రాజీనామాను ఆమోదించారు. గవర్నర్ ఈ సంద ర్భంగా కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసే వరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని నితీశ్‌ను కోరారు. మరోవైపు నేష నల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ) కూట మి శాసనసభాపక్ష నేతగా నితీశ్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అలాగే సీఎంగా నితీశ్‌కుమార్ బీహార్ పదో సీఎంగా గురువా రం ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
పాట్నాలోని గాంధీ మైదానంలో ఉదయం 11.30 గంటలకు గవర్నర్ ఆయనతో ప్రమా ణ స్వీకారం చేయించ నున్నారు. 19మంది మంత్రులతో క్యాబినెట్ కొలువుదీరబోతోందని ప్రచారం జరుగుతోంది. వేడుకలకు ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, పలువురు కేంద్ర మంత్రులు, ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరవుతారు. క్యాబినెట్ కూర్పు, హోం వంటి కీలక శాఖల కేటాయింపుపై జేడీయూ, బీజేపీ మధ్య చర్చలు జరుగుతున్నట్లు తెలిసింది.