calender_icon.png 20 November, 2025 | 1:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఓటరు జాబితా సవరణకు నేటి నుంచి స్పెషల్ డ్రైవ్

20-11-2025 12:09:51 AM

పంచాయతీ ఎన్నికలకు ఎస్‌ఈసీ కసరత్తు 

హైదరాబాద్, నవంబర్ 19 (విజయక్రాంతి) : రాష్ట్రం లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం(ఎస్‌ఈసీ) వేగంగా కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలో పంచాయతీలకు సంబంధించిన ఓటరు జాబితాను మరోసారి సవరించేందుకు ఎస్‌ఈసీ బుధవారం షెడ్యూల్ ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీలో గురువారం నుంచి నవంబర్ 23 వరకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించనుంది.

ఈ నాలుగు రోజుల్లో గ్రామాల్లో ఓటరు జాబితాలను ఇంటింటి స్థాయిలో పరిశీలించి, కొత్తగా అర్హత సాధించిన వారి పేర్లు చేర్చ డం, మరణించిన వారి పేర్లు తొలగించడం, ఇతర సవరణలు చేపట్టనున్నారు. ప్రతి గ్రామ పంచాయతీలో బూత్ లెవల్ ఆఫీసర్లు, గ్రామ రెవెన్యూ అధికారులు, స్థానిక సర్పంచ్‌ల సహకారంతో ఈ ప్రక్రియ జరగనుం ది. కాగా, ఓటర్లు తమ పేరు జాబితాలో ఉందో లేదో తెలుసుకోవడానికి, అవసరమైన సవరణలు చేయిం చుకోవడానికి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకో వాలని ఎస్‌ఈసీ సూచించింది.