calender_icon.png 27 September, 2025 | 11:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డీహెచ్‌పై అనుచిత వ్యాఖలు చేస్తారా?

27-09-2025 12:36:29 AM

చర్యలు తీసుకోవాలని సీఎంకు ప్రభుత్వ వైద్యుల విజ్ఞప్తి

ముషీరాబాద్, సెప్టెంబర్ 26(విజయక్రాంతి): ఉదయ్ కాంత్ అనే లాయర్ గత 4 రోజుల క్రితం ఒక ఛానెల్‌లో డైరెక్టర్ ఆఫ్ హెల్త్ డైరెక్టర్(డీ.హెచ్) డాక్టర్ రవీంద్ర నాయక్ ను దుర్భశలాడుతూ అవమాన పరిచేలా మాట్లాడటాన్ని తెలంగాణ ఎస్సీ, ఎస్టీ ప్రభుత్వ వైద్యుల సంఘం తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు శుక్రవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంఘం అధ్యక్షులు ప్రొఫెసర్ బాబురావు, లైసెనింగ్ ఆఫీసర్ డా.అన్న ప్రసన్న, ఉపాధ్యక్షులు డా.వెంకటేశ్వర్లు, కోశాధికారి డా.చీమ శ్రీనివాస్ మాట్లాడారు.

ఈ సందర్భంగా డాక్టర్ బాబురావు మాట్లాడుతూ దళిత డాక్టర్ అనే చులకన భావనతో అతను మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీల ఆత్మగౌరవం దెబ్బ తీసే విధంగా ఉందని రేవంత్ రెడ్డి వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. డా.అన్న ప్రసన్న మాట్లాడుతూ ఉదయ్ కాంత్ మహిళలను అవమాన పరిచే విధంగా మాట్లాడాడని వెంటనే మహిళలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. డా.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ అతనిపై వెంటనే క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరారు.