calender_icon.png 27 September, 2025 | 12:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జంట జలాశయాలకు భారీగా వరద

27-09-2025 12:37:27 AM

  1. ఉస్మాన్ సాగర్ 1౨ గేట్లు, హిమాయత్ సాగర్ ౯ గేట్లను ఎత్తిన అధికారులు

మూసీ నదిలోకి భారీగా వచ్చి చేరుతున్న వరద

అప్రమత్తమైన అధికారులు.. లోతట్టు ప్రాంతాలకు ముందస్తు హెచ్చరికలు జారీ 

హైదరాబాద్ సిటీ బ్యూరో, సెప్టెంబర్ 26 (విజయక్రాంతి)/రాజేంద్రనగర్: ఎగువ ప్రాంతాలైన వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో వర్షాలకు హైదరాబాద్ జంట జలాశయాలు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నిండుకుండలా మారాయి. శుక్రవారం సాయం త్రం 4 గంటల సమయానికి ఉస్మాన్‌సాగర్‌లోని 1౨ గేట్లను 7 అడుగుల మేర ఎత్తి 7,986 క్యూసెక్కుల నీటిని, హిమాయత్‌సాగర్‌లోని ౯ గేట్లను 3 అడుగుల మేర ఎత్తి 6,103 క్యూసెక్కుల నీటిని మూసీలోకి విడుదల చేశారు.

ఆ వరద నీరు మూసీ నదిలోకి వచ్చి చేరుతుండటంతో మూసీ కూడా ఉగ్రరూపాన్ని సంతరించుకున్నది. దీంతో అంబ ర్‌పేట వద్ద ఉన్న చారిత్రక మూసారాంబాగ్ వంతెన పైనుంచి వరద నీరు ఉద్ధృతంగా ప్రవహించడంతో, పోలీసులు మరియు రెవె న్యూ అధికారులు వెంటనే స్పందించి వంతెనపై వాహనాల రాకపోకలను పూర్తిగా నిలి పివేశారు. కాచిగూడ ట్రాఫిక్ పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి, దిల్‌సుఖ్‌నగర్ వైపు నుంచి వచ్చే వాహనాలను గోల్నాక కొత్త బ్రిడ్జి మీదుగా మళ్లిస్తున్నారు. పురానాపూల్, చాదర్ ఘాట్ వద్ద కూడా మూసీ ఉద్ధృతంగా ప్రవహిస్తోంది.

నార్సింగి మంచిరే వుల మధ్య రహదారిపై వరద నీరు పోటెత్తడంతో ఆ మార్గంలో కూడా రాకపోకలు నిలిచిపోయాయి. మూసీ పరివాహక ప్రాం త ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. జీహెచ్ ఎం సీ కమిషనర్, జలమండలి ఎండీ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీ క్షిస్తున్నారు. పరిస్థితి తీవ్రత దృష్ట్యా, జలమండలి అధికారులు సిబ్బందికి వచ్చే రెండు రోజుల పాటు సెలవులను రద్దు చేస్తున్నట్లు ఎండీ ప్రకటించా రు. సెలవులో ఉన్నవారు తక్షణమే విధులకు హాజరుకావాలని ఆదేశాలు జారీ చేశారు.

పునరావస కేంద్రానికి 55 మంది

హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ జలాశయాల గేట్లు ఎత్తివేతతో మూసీ నదిలో పెరిగిన నీటి ప్రవాహం పెరిగింది. అప్రమత్తమైన జీహెచ్‌ఎంసీ అధికారులు శివాజీ బ్రిడ్జి కింద భూలక్ష్మి ఆలయం సమీపంలోని లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న 55 మందిని శుక్రవారం గోడె కి ఖబర్ ప్రాంతంలోని కమ్యూనిటీ హాల్‌కు తరలించారు.