09-10-2025 06:09:26 PM
కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): బహుజన్ సమాజ్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కాన్షీరాం వర్ధంతిని గురువారం జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బి.ఎస్.పి జిల్లా ఇంచార్జి తుకారాం మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు రాజకీయ చైతన్యం కల్గించడంలో కాన్షీరాం కీలక పాత్ర పోషించారన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇంచార్జి కనక ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.