27-01-2026 12:00:00 AM
మర్రిగూడ, జనవరి 26 : యువత విద్యతోపాటు క్రీడారంగాల్లోనూ రాణించాలని యరగండ్లపల్లి సర్పంచ్ వల్లంల సంతోష్ యాదవ్ అన్నారు. గ్రామంలోనీ శ్రీ ముత్యాలమ్మ రియల్ ఎస్టేట్ ఆధ్వర్యంలో వారం రోజుల నుంచి మర్రిగూడ మండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్ సీజన్ -1 ను నిర్వహించారు. సోమవారం సాయంత్రం ఫైనల్ మ్యాచ్ ముగియడంతో విజేతలకు నగదుతో పాటు ట్రోఫీలను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ యువత అన్ని రంగాల్లో రాణించేందుకు తనవంతు కృషి చేస్తానన్నారు.
తదుపరీ ప్రథమ బహుమతి పొందిన యరగండ్లపల్లి టీమ్ కు రూ.25,000, ద్వితీయ బహుమతి మర్రిగూడ టీమ్ కు రూ. 15,000, నగదు తో పాటు ట్రోఫీలను ఆయన అందజేశారు. టోర్నమెంట్ లో పాల్గొన్న మిగతా టీమ్ లకు ప్రోత్సాహక బహుమతులను, ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు ప్రత్యేక బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాలపెద్దలు, నాయకులు వార్డ్ మెంబెర్స్ ఆర్గనైజర్ లు, యువకులు పాల్గొన్నారు.