calender_icon.png 25 October, 2025 | 5:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రక్తదానం చేయండి..ప్రాణదాతలు కండి..

25-10-2025 12:20:45 AM

ఎస్పీ శరత్ చంద్ర పవర్ 

నల్లగొండ క్రైమ్, అక్టోబర్ 24: పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా జిల్లా వ్యాప్తంగా రక్త దాన కార్యక్రమం నిర్వహించినట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ అన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో శుక్రవారం రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా పోలీసులతోపాటు యువకులు అధిక సంఖ్యలో పాల్గొని 150 యూనిట్లు రక్తదానం చేయడం అభినందనీయమన్నారు. రక్తదానం చేసిన ప్రతి ఒక్కరిని ఎస్పీ అభినందించారు.

పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖ ఆధ్వర్యంలో విద్యార్థుల కోసం ఆన్లైన్ వ్యాసరచన పోటీ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ పోటీల్లో 6వ తరగతి నుండి పీజీ వరకు చదువుతున్న విద్యార్థులు పాల్గొనవచ్చు అన్నారు. పోటీలు తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ భాషల్లో ఉంటుందని.

విద్యార్థులు తమ వ్యాసాలను అక్టోబర్ 30వ తేదీ లోపు అందించాలని ఉత్తమంగా ఎంపికైన ముగ్గురు విద్యార్థులను రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేస్తారన్నారు. జిల్లా స్థాయిలో 1వ, 2వ, 3వ స్థానాల్లో విజేతలకు బహుమతులు ప్రదానం చేస్తామన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని తమ ప్రతిభను ప్రదర్శించి జిల్లా, రాష్ట్రస్థాయిలో బహుమతులు సాధించాలని సూచించారు.