06-09-2025 12:05:30 AM
ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
పటాన్ చెరు(సంగారెడ్డి), సెప్టెంబర్ 5 :రక్తదానం ప్రాణదానంతో సమానమని ఎ మ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పేర్కొన్నా రు. మిలాద్ ఉన్ నబి పురస్కరించుకొని ఇ స్నాపూర్ మున్సిపాలిటీలో శుక్రవారం మే రా ఇండియా సోషల్ సర్వీస్ స్వచ్ఛంద సం స్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శి బిరాన్ని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సమాజ సేవలో మేరా ఇండి యా సోషల్ సర్వీస్ సంస్థ చేపడుతున్న కా ర్యక్రమాలను ఆయన అభినందించారు. అ నంతరం రక్తదానం చేసిన వారికి సర్టిఫికేట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో మా ర్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమా ర్, సీనియర్ నాయకులు దశరథ్ రెడ్డి, వెం కట్ రెడ్డి, శ్రీశైలం, మల్లారెడ్డి, శోభ కృష్ణారెడ్డి, అంజిరెడ్డి, శ్రీనివాస్, మేరాజ్ ఖాన్, స్వచ్ఛంద సంస్థ బాధ్యులు, తదితరులు పాల్గొన్నారు.