06-09-2025 12:04:35 AM
పెబ్బేరు రూరల్, సెప్టెంబర్ 5: బడుగు బలహీన వర్గాల సొంతింటి కల ఇందిరమ్మ రాజ్యంలోని ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ తోనే సాధ్యమని వనపర్తి ఎమ్మెల్యే తూడి మెగా రెడ్డి అన్నారు. శుక్రవారం పెబ్బేరు మండలంలోని మాలపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులైన వెంకటమ్మ, నీలమ్మ తో కాసేపు ముచ్చటించారు.
లబ్ధిదారులు ఎమ్మెల్యేతో వారి మాటలు పం చుకుంటూ గత పది సంవత్సరాల నుంచి సొంత ఇంటి నిర్మాణం కోసం నాయకులు, అధికారుల చుట్టూ సంవత్సరాల తరబడి తిరిగినా ఫలితం దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత ప్రభుత్వంలో మా సొంతింటి కల నెరవేరినందున ఎమ్మెల్యేతో లబ్ధిదారులు కాంగ్రెస్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.