06-09-2025 12:06:35 AM
మెదక్, సెప్టెంబర్ 5(విజయక్రాంతి):వినాయక నిమజ్జనం కోసం ఏర్పాటు చేసిన నిమజ్జన ఘాట్లను జిల్లా ఎస్పీ శ్రీనివాసరా వు శుక్రవారం పరిశీలించారు. ముఖ్యంగా కోంటూరు నిమజ్జనం పాయింట్ను సందర్శించి అక్కడి భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. నిమజ్జన కార్యక్రమం సురక్షితంగా, ప్రశాంతంగా జరగడానికి చేపట్టిన ఏర్పాట్లను ఆయన పరిశీలించారు.
ఈ సందర్భం గా ఘాట్ వద్ద విధులు నిర్వహిస్తున్న ఎస్‌ఐ మురళి నిమజ్జనం కోసం చేపడుతున్న భద్రతా చర్యలు, పోలీసు సిబ్బంది విభజన, ట్రాఫిక్ నియంత్రణ, జన సమూహం ని యంత్రణ, రక్షణ సిబ్బంది ఏర్పాటు వంటి అంశాలను వివరించారు. చిన్నపిల్లలు, వృ ద్ధులు నిమజ్జనం కోసం వచ్చే సందర్భంలో ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆదేశించారు. అదేవిధంగా అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించేందుకు అంబులెన్స్, రక్షణ బృందాలు సిద్ధంగా ఉండాలని స్పష్టం చేశారు.