04-10-2025 12:00:00 AM
శంకర్ పల్లి, అక్టోబర్ 03, విజయ క్రాంతి : అన్నదానం మహాదానమని అమ్మవారి మండపం వద్ద అన్నదానం చేయడం పూర్వజన్మ సుకృతం అని భానూరి కృష్ణ యాదవ్ అన్నారు. మండల పరిధిలోని కొండకల్ గ్రామంలో ఏర్పాటు చేసిన దుర్గామాత మండపం వద్ద ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మాట్లాడారు. అమ్మవారి ఆశీస్సులు ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని సమయానికి వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని ఆకాంక్షించారు.