04-10-2025 12:00:00 AM
శంకర్ పల్లి మున్సిపల్ అక్టోబర్ 3 విజయ క్రాంతి: విజయదశమి శుభాకాంక్షలు తెలుపుతూ దేవి శరన్నవరాత్రుల నిమజ్జనంను పురస్కరించుకొని భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రజా పాలన సేవా కార్యక్రమాలలోని భాగంగా శుక్రవారం నాడు శంకరపల్లి సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్థానిక చౌరస్తాలో విజయ మిల్క్ పాయింట్ వద్ద భక్తులకు పరమాన్నంను పంపిణి చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో సేవ ఫౌండేషన్ అధ్యక్షుడు ఆర్ నరేష్ కుమార్, వేనేంద్ర , వైస్ ప్రెసిడెంట్ జయరాం రెడ్డి కార్తీక్ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ కరాటే రవీందర్ యాదవ్ వైభవ్ దత్తు వెంకటేష్ మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా నరేష్ కుమార్ మాట్లాడుతూ నేడు భారతదేశం అగ్రగామిగా ప్రపంచ దేశాలను సైతం ఆశ్చర్యపరిచేలా అభివృద్ధి అయ్యిందంటే అది కేవలం భారత ప్రధాని మోడీ వల్లనే అన్నారు.
ఈ నెల 17వ తేదీ ఆయన పుట్టిన రోజును పురస్కరించుకొని భారతదేశం అంతా విదేశాలలో కూడా సేవా కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది . ఆరెళ్ల గా రేషన్ బియ్యం ను ఉచితంగా పంపిణీ చేస్తున్న నరేంద్ర మోడీ నిస్వార్థ సేవ కోసం సేవ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రుచికరమైన పరమాన్నంను పెట్టడం సేవ ఫౌండేషన్ గొప్పగా భావిస్తుందన్నారు.