calender_icon.png 4 October, 2025 | 3:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా గాంధీజీ జయంతి

04-10-2025 12:00:00 AM

ఘట్ కేసర్, అక్టోబర్ 3 (విజయక్రాంతి) :  మహాత్మగాంధీ జయంతి వేడుకలను ఉమ్మడి ఘట్ కేసర్ మండలంలో గురువారం ఘనంగా నిర్వహించారు. గాంధీజీ చిత్రపటాలకు, విగ్రహాలకు నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్బంగా నాయకులు  గాంధీజీ దేశానికి చేసిన సేవలను కొనియాడారు.

ఘట్ కేసర్ పట్టణంలో జరిగిన కార్యక్రమoలో మున్సిపల్ కాంగ్రెస్ అధ్యక్షులు మామిళ్ళ ముత్యాల్ యాదవ్, ప్రధాన కార్యదర్శి బర్ల రాధాకృష్ణ ముదిరాజ్, యువజన కాంగ్రెస్ అధ్యక్షులు బొక్క సంజీవరెడ్డి, సీనియర్ నాయకులు కొంతం అంజిరెడ్డి, వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్ చిలుకూరి మచ్చందర్ రెడ్డి, నాయకులు ఉల్లి ఆంజనేయులుయాదవ్, కె. నర్సింగ్ రావు, ఫరూక్, మేకల సునీల్ కుమార్, టి. మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

మేడ్చల్‌లో..

మేడ్చల్, అక్టోబర్ 3 (విజయ క్రాంతి): మేడ్చల్ జిల్లాలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కలెక్టరేట్లో జరిగిన కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారిని హరిప్రియ గాంధీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఏవో రామ్మోహన్, ఏ ఈ ఈ నిషా రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మేడ్చల్ మండలం పూడూరు గ్రామంలో సీఐ సత్యనారాయణ మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. 

జర్నలిస్ట్ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. మేడ్చల్ లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ అధ్యక్షుడు వేముల శ్రీనివాసరెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు గోమారం రమణారెడ్డి, గౌడవెల్లి మాజీ సర్పంచ్ గరిసెల సురేంద్ర ముదిరాజ్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ రమేష్ కురుమ, మాజీ కౌన్సిలర్ కౌడే మహేష్, లవంగు రాకేష్ మంజరి, రాజు గౌడ్, నాగేష్, వేముల రంజిత్ రెడ్డి పాల్గొన్నారు.