calender_icon.png 7 November, 2025 | 12:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సైబర్ క్రైమ్, నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..

06-11-2025 10:50:29 PM

కన్నాయిగూడెం ఎస్సై ఇనిగాల వెంకటేష్..

కన్నాయిగూడెం (విజయక్రాంతి): సైబర్ క్రైమ్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కన్నాయిగూడెం ఎస్సై ఇనిగాల వెంకటేష్ తెలిపారు. గురువారం కన్నాయిగూడెం మండలంలోని తుపాకులగూడెం గ్రామం వద్ద ఉన్న సమ్మక్క సాగర్ బ్రిడ్జిపై ప్రయానికులకు సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై ఇనిగాల వెంకటేష్ మాట్లాడుతూ ప్రజలు అప్రమత్తంగా ఉంటూ సైబర్ నేరాల పట్ల అవగాహన ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలన్నారు. అపరిచిత వ్యక్తులు ఫోన్ చేసిన, మెసేజ్లు పంపిన వాటికి వెంటనే స్పందించవద్దన్నారు. ఫోన్ లోకి వచ్చే ఓటీలు చెప్పాలంటూ వచ్చే ఫోన్ కాస్పటల్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.