calender_icon.png 7 November, 2025 | 12:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మినీ ట్యాంక్‌బండ్ వద్ద ఆటో-బైక్ ఢీ

06-11-2025 10:43:34 PM

భాస్కర్‌కు తీవ్ర గాయం..!

ఎల్లారెడ్డి (విజయక్రాంతి): ఎల్లారెడ్డి పట్టణంలోని మినీ ట్యాంక్ బండ్ వద్ద గురువారం సాయంత్రం చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఎదురెదురుగా వచ్చిన ఆటో–బైక్ ఢీకొనడంతో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, ఎల్లారెడ్డి మండలం రుద్రారం గ్రామానికి చెందిన భయగోని భాస్కర్ (ద్విచక్ర వాహనం నంబర్ AP25C9540) ఎల్లారెడ్డి నుండి స్వగ్రామానికి వెళ్తుండగా, నాగిరెడ్డిపేట్ మండలం జప్తి జాన్కంపల్లి గ్రామానికి చెందిన గణేష్ నడిపిస్తున్న ఆటో (TS16UB0035) ఎదురెదురుగా వచ్చి ఢీకొన్నాయి. ఈ ప్రమాదం తీవ్రతకు భాస్కర్ కాలు విరిగింది. స్థానికులు వెంటనే స్పందించి 108 అంబులెన్స్ సేవలకు కాల్ చేసి, గాయపడిన వ్యక్తిని ప్రాథమిక చికిత్స అనంతరం సమీప ఆసుపత్రికి తరలించారు. చూసిన వారంతా దిగ్భ్రాంతికి గురయ్యారు. రోడ్లపై జాగ్రత్త తప్పితే జీవితం ప్రమాదంలో పడుతుంది. అంటూ స్థానికులు విచారం వ్యక్తం చేశారు.