06-11-2025 10:26:53 PM
వెంకటాపురం(నూగూరు) (విజయక్రాంతి): సైబర్ క్రైమ్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వెంకటాపురం ఎస్సై కొప్పుల తిరుపతిరావు తెలిపారు. గురువారం మండల కేంద్రంలోని ఆర్ అండ్ బి అతిథి గృహం ఆవరణలో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై తిరుపతిరావు మాట్లాడుతూ ప్రజలు అప్రమత్తంగా ఉంటూ సైబర్ నేరాల పట్ల అవగాహన ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలన్నారు. అపరిచిత వ్యక్తులు ఫోన్ చేసిన, మెసేజ్లు పంపిన వాటికి వెంటనే స్పందించవద్దన్నారు. ఫోన్ లోకి వచ్చే ఓటీలు చెప్పాలంటూ వచ్చే ఫోన్ కాస్పటల్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. అభయ మిత్ర కార్యక్రమంలో భాగంగా ప్రజలకు సైబర్ నేరాల పట్ల అవగాహన కల్పించేందుకు సమావేశం నిర్వహించినట్లు వివరించారు.