calender_icon.png 7 November, 2025 | 12:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు ఏటూరునాగారం డిగ్రీ గురుకుల విద్యార్థులు ఎంపిక

06-11-2025 10:35:37 PM

ఏటూరునాగారం (విజయక్రాంతి): రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలకు ఏటూరునాగారం డిగ్రీ బాలికల గురుకులం కళాశాల విద్యార్థినిలు మేఘన, కీర్తనలు టీచర్ వెల్ఫేర్ సొసైటీ (ఆర్ టి డబ్ల్యూ ఎస్) ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లాలో నేటి నుండి జరగబోయే 58వ రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీలకు ఉమ్మడి వరంగల్ జిల్లా సీనియర్ ఖోఖో పోటీలు జవహర్లాల్ స్టేడియంలో నిర్వహించగా తమ కళాశాల విద్యార్థులు పాల్గొని తమ ప్రతిభ కనబరిచి క్రీడలలో రాణించి రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు ఎంపిక కావడం జరిగిందినీ. కళాశాల ప్రిన్సిపాల్ ప్రమీల. పిడి. డి అరుణ లు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేటి నుండి జరగబోయే రాష్ట్ర స్థాయి పోటీలలో కళాశాల విద్యార్థినిలు మేఘన. కీర్తనలు పాల్గొనడం జరుగుతుందన్నారు.

జిల్లా స్థాయిలో మంచి క్రీడా నైపుణ్య ప్రదర్శించి రాష్ట్రస్థాయిలో ఎంపికైన విద్యార్థులకు కళాశాల ప్రిన్సిపాల్.. వ్యాయామ ఉపాధ్యాయురాలు సిబ్బంది అభినందించారు. రాష్ట్ర జాతీయ స్థాయిలో రాణించి కళాశాలకు గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని అన్నారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడా రంగంలో కూడా క్రీడా నైపుణ్య ప్రదర్శించి రాణించాలని . క్రికెట్లో ప్రపంచ కప్ సాధించి మహిళలు తలుచుకుంటే సాధించలేనిది ఏదీ లేదని నిరూపించారు అన్నారు. ఆస్ఫూర్తితో రాష్ట్రస్థాయిలో జాతీయస్థాయిలో మంచి క్రీడా నైపుణ్యం ప్రదర్శించి రాణించాలన్నారు. జాతీయస్థాయిలో క్రీడారంగంలో రాణించిన విద్యార్థులకు స్పోర్ట్స్ కోటాలో మంచి ఉద్యోగాలు లభిస్తాయని అన్నారు. క్రీడలను ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది అన్నారు. క్రీడల్లో రాణిస్తున్న విద్యార్థులకు పలువురు అభినందనలు తెలిపారు.