calender_icon.png 7 November, 2025 | 1:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జిల్లాలో బాల్య వివాహాలను నిరోధించడం ప్రతి ఒక్కరి బాధ్యత

06-11-2025 10:53:57 PM

జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష..

పెద్దపల్లి (విజయక్రాంతి): జిల్లాలో బాల్య వివాహాలను నిరోధించడం ప్రతి ఒక్కరి బాధ్యత తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు. గురువారం సమీకృత జిల్లా కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ భేటీ బచావో బేటి పడావో కార్యక్రమంలో భాగంగా చేపట్టిన బాల్య వివాహాల నిరోధన పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో బాల్య వివాహాలు చేయడం, ప్రోత్సహించడం చట్టరీత్య నేరమని, బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని అన్నారు.

బాల్య వివాహా నిషేధ చట్టం-2006 గురించి వివరిస్తూ ఆడపిల్ల వయస్సు 18 సంవత్సరాలు నిండక ముందే పెళ్ళి చేసుకున్నట్లయితే వాటి వల్ల కలిగే మానసిక శారీరక ఆర్ధిక అనర్థాలు వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి పి వేణుగోపాల్, జనరల్ స్పెషలిస్ట్ సుచరిత, డి.హెచ్.ఈ.డబ్ల్యూ కోఆర్డినేటర్ దయ అరుణ సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.